calender_icon.png 3 February, 2026 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పంచాయతీ కార్యదర్శి చాలా బిజీ

03-02-2026 02:06:39 AM

గ్రామానికి ఎప్పుడు వస్తారో వెళ్తారు సర్పంచ్‌కే తెలియదంట

ఇదేం విధానం అంటున్న గ్రామస్తులు

జడ్చర్ల, ఫిబ్రవరి 2 : ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎల్లప్పుడూ చాలా బిజీగా ఉంటారంట. జడ్చర్ల మండలం మల్లెబోయిన్ పల్లి గ్రామానికి రావలసిన పంచాయ తీ సెక్రెటరీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. సోమవా రం మధ్యాహ్నం 12: 30 గంటలకు గ్రామానికి చేరుకోలేదు. ఇలా ప్రతిరోజు సమయా నికి రాకపోవడంతో గ్రామ పంచాయతీలో ఫిర్యాదులు చేయవలసినప్పటికీ పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పంచాయతీ సెక్రెటరీ సమయానికి గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పరిచి. స మగ్ర సమాచారం సేకరించి. ప్రజా ప్రతినిధులకు అందజేయడానికి ప్రజలకు. ప్రభు త్వానికి వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని అందుబాటులో ఉంచినప్పటికీ ఆ ఉద్యోగి సరియైన విధులు నిర్వహించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జడ్చర్ల మండల పరిధిలో మల్లె బోయినపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి గ్రామానికి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతా డు తెలియడం లేదు కార్యదర్శి ఎప్పుడు ఫోన్ చేసినా ఈడ ఉన్న ఆడ ఉన్న అని చెప్పుకుంటూ విధులకు కాలయాపన చేస్తుంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 

మల్లె బోయినపల్లి గ్రామ సర్పంచ్ చీకూరు శేఖర్ గ్రామపంచాయతీ సెక్రటరీ తో ఫోన్లో మా ట్లాడితే నేను ప్రజావాణికి వెళ్తున్నానని చె ప్పారని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ వివరణ కోరగా ఎంపీడీవో మా ముందు పంచాయతీ సెక్రెటరీ కి ఫోన్ చేసి మీరు మ ల్లె బోయిన్పల్లి గ్రామపంచాయతీ ఆఫీస్ కి వెళ్ళారా? అని అడిగారు, పంచాయతీ కార్యదర్శిలు ప్రజావాణికి మేము ఎప్పుడు పిలు వము అని సమాధానం ఇచ్చారు. అతను ఆఫీస్ లో సెల్ఫీతో కూడిన ఫోటోతో దిగి హాజరైనట్లు ఎంపీడీవో మాకు చూపించడం విశేషం. గ్రామపంచాయతీ సర్పంచ్ పంచాయతీ సెక్రెటరీ రాలేదు అని సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి ప్రజలకు అధికారులను అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.