calender_icon.png 3 February, 2026 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే పట్టణ అభివృద్ధి సాధ్యం

03-02-2026 02:04:50 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఫిబ్రవరి 2 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణ అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.సోమవారం కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు బీఫారమ్లను అందజేసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుర్తి మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.

గత ప్రభుత్వం మున్సిపాలిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.