అన్నింటినీ మింగిన ఆ రాయి!
డైనోసార్లను అంతం చేశాయని పలు పరిశోధనల్లో వెల్లడి
అమ్మోనైట్ శిలాజాల అంతానికి కూడా గ్రహశకలాలే కారణమట..
న్యూఢిల్లీ జూన్ 28: చాలా సంవత్సరాల కిందట డైనోసార్ జాతిని అంతం చేసిన గ్రహశకలాలు మరో జీవజాతిని కూడా అంతం చేశాయని తాజా పరిశోధన వెల్లడించింది. 66 మిలియన్ సంవత్సరాల క్రితం అమ్మోనైట్ శిలాజాలు అంతం అయ్యేందుకు ఈ గ్రహశకలాలు కారణం అయినట్లు పరిశోధన వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లోని పాలియోంటాలజిస్ట్‌ల బృందం ఈ పరిశోధనకు నేతృత్వం వహించింది. అమ్మోనైట్ శిలాజాలు సడెన్‌గా అంతం కావడానికి గ్రహశకలాలే కారణం అని ఈ స్టడీ వివరించింది.
అమ్మోనైట్ శిలాజాలు అనేవి సముద్ర జీవులు. ఇవి సెఫొలోపాడా జాతికి చెందిన జీవులు. ఇవి చూసేందుకు ఆక్టోపస్, కటిల్‌ఫిష్ మాదిరిగా ఉంటాయి. లీడ్ ఆథర్ అయిన డాక్టర్ జోసెఫ్ ఫ్లన్నెరీ మాట్లాడుతూ.. సమయానుగుణంగా జీవవైవి ద్యంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడం ముఖ్యమని, శిలాజ రికార్డులను మనం అంతగా నమ్మకూడదని తెలిపారు. లండన్‌లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన డాక్టర్ జేమ్స్ మాట్లాడుతూ... అమ్మోనైట్ శిలాజాల జాతుల మధ్య ఉన్న తేడాలు తెలుసుకోవడం ముఖ్యమని, అవి కూడా కొన్ని ప్రాంతాల్లో బతికేందుకు ఇబ్బందులు పడి ఉంటాయన్నారు.






