కురుమ సంఘం అధ్యక్షుడిగా తాటిపల్లి మల్లేశం
మునిపల్లి, జనవరి 4 : కురుమ సంఘం మునిపల్లి మండల నూతన కమిటీని జిల్లా కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పైతర సాయికుమార్, కురుమ సంఘం సీనియర్ నాయకులు మంతూరి శశికుమార్, చిట్కుల వెంకటేశం, బండారి పాండుల ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కురమ మండల అధ్యక్షునిగా తాటిపల్లి గ్రామానికి చెందిన తాటిపల్లి మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్కుల సుధాకర్, ఉపాధ్య క్షులుగా హైద్లాపూర్ బక్కన్న, ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి సుధాకర్, సహాయ కార్యదర్శిగా యాదయ్య, కోశాధికారిగా మన్సాన్పల్లి నర్సింహులు, సలహాదారులుగా మేళాసంగం శ్రీనివాస్ ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి కురు మ సంఘం మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు కురుమల సమస్యల కోసం పోరాటం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద లోడి గ్రామ సర్పంచ్ హనుమంతు రాజు, కల్లపల్లి గ్రామ సర్పంచ్ గొల్ల నరసమ్మ, నాయకులు దండు బక్కన్న, గొల్ల చంద్రన్న, కక్కిరవాడ విఠల్, బుర్ర సురేష్, హనుమంత్ ప్రహ్లాద్, పోచారం అంజయ్య, బేలూరు యాదయ్య పాల్గొన్నారు.






