05-01-2026 12:16:20 AM
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాలుర బాల్ బ్యాట్మెంటన్ సెలక్షన్స్
చేవెళ్ల, జనవరి 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని నాన్చేరి గ్రామ రెవెన్యూ గల్లా ఖానాపూర్ గేట్ సమీపంలోని బాల్ బ్యాట్మెంటన్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా బాలుర బాల్ బ్యాట్మెంటన్ సెలక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా... ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య గౌడ్,మల్కాజ్గిరి జనరల్ సెక్రెటరీ సాయినాథ్ గౌడ్, రవీందర్ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ.. క్రీడాలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. మంచి నాలెడ్జి కల్లా క్రీడాలలో ఒకటి బాల్ బ్యాట్మెంటన్ మైండ్ పవర్ తో ఆడాల్సిన గేమ్ అని అన్నారు.
ఈ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయిన ఇరుజట్లను ఈనెల 10, 11 తారీఖులలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గ్రామంలో నిర్వహించబడే రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నాయి. ఈ కార్యక్రమంలోని సర్పంచ్ అశోక్ మాజీ ఉపసర్పంచ్ మధు, అశోక్ నరేందర్ మహేందర్ రాజలింగం మల్లేష్ శ్రీనివాస్ గౌడ్ చంద్రయ్య, ఏం బాలాజీ రావు గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.