05-01-2026 12:18:15 AM
రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
చేవెళ్ల, జనవరి 4(విజయక్రాంతి): బలమైన నాయకత్వం, క్యాడర్,ప్రజా బలం ఉన్న చేవెళ్ల, శంకర్ పల్లి మున్సిపాలిటీలో రానున్న మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు దిశగా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని రాజేంద్ర నగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి పెట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వైభవ్ కన్వెన్షన్‌లో శంకర్ పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కార్తీక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాల అమలు చేయలేదన్నారు. మున్సి పాలిటీ ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ పథకాల ఎగవేతపై ప్రజలకు ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ నేతలు కార్యకర్తలు సమాన్వయంతో ఎన్నికల్లో విజయ డంక మోగించాలని ఆయన పిలుపునిచ్చారు.