అందుకే నో చెప్పలేకపోయా!
18-08-2026 12:20 AM
వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకు చేసిన వాటన్నింటికంటే ఈ షో చాలా విభిన్నంగా ఉంటుంది. అదే నేను నో చెప్పలేకపోవడానికి ప్రధాన కారణం.
తమిళ సెలబ్రిటీలు కిచెన్‌లోకి అడుగుపెట్టి, రిస్క్‌లు తీసుకోవడం, తప్పులు చేయడం, తమను తామే సర్‌ప్రైజ్ చేసుకోవడం, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్యాషన్‌తో పోటీపడటాన్ని చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ త్వరలోనే సోనీ విళా, సోనీ లివ్‌లోకి రానుం ది. సోనీ విళాతో కలిసి మేం ఏం వండబోతున్నామో అంద రూ చూసి ఎంజాయ్ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను” అని తెలిపింది.






