calender_icon.png 4 November, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా రక్క సిని తరిమికొట్టండి

04-11-2025 12:32:04 AM

-కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలు అమలు చేపిస్తాం

-కుర్చీని కాపాడుకునేందుకు రేవంత్ రూ.100 కోట్లు రాహుల్‌కు పంపిస్తున్నాడు

-4 కోట్ల మంది ప్రజల తరఫున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వాలి

-బోరబండ రోడ్ షోలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 3 (విజయక్రాంతి) : ఈ ఎన్నికలు కారుకు, బు ల్డోజర్లకు మధ్య జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామా రావు అన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ‘హైడ్రా అనే రాక్షసి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది పేదల ఇళ్లను కూల్చివేసింది. హైడ్రా బాధితుల కన్నీ ళ్లు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుం ది.

ఈ రాక్షసి మాయం కావాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటు వేయాలి’, అని కేటీఆర్ అన్నారు. ‘ప్రతి పేదవాడికి మేం అం డగా నిలబడతాం, అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం. సునీతమ్మకు నేను న్నా, కేసీఆర్ ఉన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి నా అరగంటలో మీ ముందుంటాం’, అని ఆయన భరోసా ఇచ్చారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు.

‘ఇందిర మ్మ ఇళ్లు రాలేదు, మహిళలకు స్కూటీలు రాలేదు, రూ.4 వేల పెన్షన్ అందలేదు. రేవంత్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలన్నారు.. నోటిఫికేష న్లు లేవు కానీ లూటిఫికేషన్లు మాత్రం జోరు గా సాగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీలోని రాహుల్ గాం ధీకి రూ.100 కోట్లు పంపిస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

‘ఢిల్లీకి పం పేందుకు డబ్బులున్నాయి కానీ, పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు నిధులు లేవట. ఇదే విషయాన్ని వారి ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారు’, అని ఆయన విమర్శించారు. కంటోన్మెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చని రేవంత్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌లో ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించా రు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే జూబ్లీ హిల్స్‌లో పథకాలు రద్దు చేస్తామని సీఎం బెది రిస్తున్నారు.

ఎవడబ్బ సొమ్మని పథకా లు బంద్ చేస్తారు? మీరు బీఆర్‌ఎస్‌ను గెలిపించండి, మేం అసెంబ్లీలో కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలు అమలు చేయిస్తాం’, అని కేటీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రత్యర్థులు డ బ్బులు పంచి, దొంగ ఓట్లు వేయడానికి ప్ర యత్నిస్తారని, వారు డబ్బులు ఇస్తే తీసుకుని, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఆ యన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 4 కోట్ల మం ది ప్రజల తరఫున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు నివ్వనున్నారని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ రోడ్ షోతో బోరబండ ద ద్దరిల్లింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వినాయకనగర్, ఎస్సార్టీ నగర్‌తో పాటు చుట్టుప క్కల ప్రాంతాలనుంచి వేలాదిగా ప్రజలు, కా ర్యకర్తలు తరలిరావడంతో బోరబండ వీధు లు జనసంద్రంగా మారాయి. కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత జనం హాజరుకావడంతో రోడ్ షో నెమ్మదిగా ముందుకు సాగింది. ఈ జనసందోహాన్ని చూస్తుంటే సునీతమ్మ గెలుపు ఖాయమని, మెజారిటీ ఎంతనేదే తే లాల్సి ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.