calender_icon.png 2 July, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పినపాక నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

01-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 అశ్వాపురం, జూన్ 30(విజయ క్రాంతి):పినపాక నియోజకవర్గ అభివృద్దే ధ్యేయం అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు అన్నారు. అశ్వాపురం మండలంలో సోమవారం ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు పర్యటించారు . అశ్వాపురం, తురుమల గూడెం గొల్లగూడెం, చింతిర్యాల, సండ్రల బోడు గ్రామ పంచాయితీ లలో రూ. 50 లక్షలతో సీ సీ రోడ్లు ప్రారంభించారు. రూ. 2 కోట్లతో సంద్రలబోడు , చింతిర్యాల రహదారికి శంకుస్తాపన చేశారు. సండ్రల బోడు గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.

అనంతరం బీ సీ హాస్టల్ ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నానన్నారు. ప్రజలు తమ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మణిధర్, ఎంపీడీవో ముత్యాలరావు, ఎం ఈ ఓ వీరస్వామి, ఏ పీ ఎం సత్యనారాయణ,ఏ ఈ లు చారి, కిషోర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, నెల్లిపాక పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి,నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.