calender_icon.png 2 July, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరులో 105 శాతం బొగ్గు ఉత్పత్తి

01-07-2025 12:00:00 AM

మణుగూరు, జూన్ 30 ( విజయ క్రాంతి) : సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో జూన్ నెలలో 105 శాతం బొగ్గుఉత్పత్తిసాధించినట్లు ఏరియా జిఎం దుర్గం రామచందర్ తెలిపారు. సోమవారం జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ వివరాలను వెల్లడించారు.

జూన్ నెలలో ఉత్పత్తి లక్ష్యం 9,86 వేల,500 టన్నులకు గాను 10 లక్షల 36వేల 101 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. అలాగే జూన్ నెలలో ఏరియా నుండి 9 లక్షల 93 వేల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు.నిర్ధేశించిన లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధించిన గనుల అధికారులను, ఉద్యోగులను, కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు. ఏరియాలో ఉత్పత్తి పెంచేందుకు అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో సింగరేణికి సంబం ధించిన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.