మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై చేసిన ఆరోపణలు సరైనవి కావు
నిలదీసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ వర్గీయులు
తూప్రాన్, జులై 13గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జీవితం కాంగ్రెస్ పార్టీకి అంకితం అయిపోయిందని, ఒక మాజీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ నర్సారెడ్డి వర్గీయులు ముక్తకంఠం తో తెలిపారు. నర్సారెడ్డి లంచాలు తీసుకొని పదవులు ఇచ్చారన్నది అవాస్తవమని లేనిపోని ఆబండాలు వేస్తూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ వర్గీయులే చేయడం సిగ్గుచేటని అన్నారు.
ఆదివారం టోల్గేట్ సమీపంలోని అతిథి గృహంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూం కుంట నర్సారెడ్డి నీ ఉద్దేశించి మాట్లాడిన తీరు వాడిన పదజాలం సరైనది కాదంటూ ఇదే గెస్ట్ హౌస్ లో నర్సారెడ్డి వర్గీయులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తూప్రాన్, మనోహరాబాద్ మండలాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమిష్టిగా మాట్లాడుతూ..
నర్సారెడ్డి ఎంతోమంది తూప్రాన్, మనోహరాబాద్ మండలంలోని కాంగ్రెస్ నాయకులకు అనేక విధాలుగా సహాయం చేస్తూ దారి చూపించాడని హితవు పలికారు. పిసిసి అధిష్టానం నాయకులు నర్సారెడ్డి తో ఒక మాట చెప్పకుండా అధికారికంగా ప్రకటన చేయడం చాలా బాధాకర విషయమని దీని దృష్టిలో పెట్టుకొని నరసారెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ గా ఉండడంతో తిరిగి కమిటీలు వేయడం జరిగిందే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. ఇరువర్గాల కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఉండడం మంచిది కాదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కీర్తన విటల్ రెడ్డి, నాచారం ట్రస్ట్ చైర్మన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా, మాజీ చైర్మన్ భర్త మామిళ్ళ కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






