2 June, 2026 | 2:43 AM

అపాయింటెడ్ డే ప్రకటించాలి

02-06-2026 12:00 AM

కుషాయిగూడ, జూన్ 1(విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జూన్ 2ను అపాయింటెడ్ డేగా వెంటనే ప్రకటించాలని ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలు పు మేరకు సోమవారం కుషాయిగూడ డిపో లో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డేను ఘనంగా నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికు లు బ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డే ప్రకటించడంలో జాప్యం చేయకుండా జూన్ 2నే అధి కారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన హక్కులు, సర్వీస్ ప్రయోజనాలు కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు సుబ్రహ్మణ్యం, ఉపేందర్, సోమయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు.