జూన్ 2న అపాయింటెడ్ డేట్ ప్రకటించాలి
- అందుకు మీరు చొరవ చూపాలి
- ఎంపీ వేం నరేందర్‌రెడ్డికి ఆర్టీసీ జేఏసీ నేతల వినతి
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి) : ఆర్టీసీ యూనియన్ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనానికి సంబంధించి అ పాయింటెడ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాజ్యసభ ఎం పీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని టీజీఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. రిటైర్డ్ ఉ ద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల కో సం తగిన నిధులు విడుదల చేయాలని విజ్ఞ ప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి, ఉద్యోగుల్లో పెరు గుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆర్టీసీ జేఏ సీ నాయకులు గురువారం వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి కూడా పాల్గొన్నారు.
జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కో కన్వీనర్లు బీ.యాదగిరి, వీ.బాబు, ఎన్. బుద్ధ విశాల్, జీ.రవికిరణ్ తదితరులు పాల్గొని ప్రస్తుతం ఆర్టీసీ విలీనంపై జరుగుతున్న పరిణామాలను వివ రించారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టు కుంటుందని స్పష్టం చేశారు. జూన్ 2న అ పాయింటెడ్ డేట్ ప్రకటన అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విలీన విధి విధానాల రూపకల్పన కోసం అధికారులు, కార్మిక సంఘాలతో కూడిన కమిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పా రు. విలీన ప్రక్రియ సజావుగా జరిగి ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయిలో మేలు జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.






