శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
18-03-2026 12:09 AM
ఎర్రుపాలెం మార్చి 17 (విజయక్రాంతి): శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం నందు 19వ తేదీ నుండి 28 తేదీ వరకు నిర్వహించబడును. శ్రీ వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎం. హనుమంతరావు, శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ వారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు దేవాదాయ శాఖ శ్రీ గోవింద హరి ఇచ్చి స్వామివారి శేష వస్త్రములు,
ప్రసాదము అందించి హ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగినది. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు , ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయ దేవశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ గారు, వి.వంశీ పాల్గొన్నారు.




