24 July, 2026 | 3:21 AM

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

24-07-2026 12:39 AM

గంభీరావుపేటలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన

గంభీరావుపేట, జూలై 23 (విజయ క్రాంతి): ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ విగ్రహం ముందు దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ,

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాం తియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో అణచివేతకు పాల్పడిందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూ ర్తికి విరుద్ధమని, రాజ్యాంగ విలువలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ కార్య క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.