మహిళను కాల్చి చంపిన దుండగులు
14-10-2025 12:13 AM
కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు
పెంట్లవెల్లి అక్టోబర్ 13 : నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని మంచాలకట్ట గ్రామంలో సగం వరకు కాలిన మృతదేహం బయటపడిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక రైతులు పొలాల్లో పనికి వెళ్లిన సమయంలో, సాకలి రాముడు అనే రైతు పొలంలో ఒక మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించారు.
ప్రాథమికంగా మహిళను కాల్చి చంపినట్లు గుర్తించారు. సుమారు 35 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పెంట్లవెల్లి ఎస్‌ఐ రామన్ గౌడ్ వెల్లడించారు.






