calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూత్రపిండాల మార్పిడితో ‘కొత్త’ జీవితం

14-10-2025 12:13:08 AM

  1. కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులకు వరం
  2. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో 300 మందికి పైగా పేషెంట్లతో ఆత్మీయసమ్మేళనం 
  3. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ కేవ లం 36 నెలల్లో 300 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌ని విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా అవయవ దాతలు, అవయవ గ్రహీతలు, నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, సహాయక సిబ్బందితో కూడిన అత్యంత నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞుల వైద్య బృందాన్ని గౌరవించడం కోసం సోమవారం యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొని అవయవ దాతలను, అవయవ గ్రహీతలను, ఇంతటి మైలురాయిని సాధ్యం చేసిన యశోద హాస్పిటల్స్ వైద్యులను అభినందించారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్.రావు మాట్లాడుతూ.. “మా అన్ని యూనిట్ల లో ఇప్పటివరకు 3,500కి పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాం ట్స్‌ను చేయగా, ఒక్క హైటెక్ సిటీ యూనిట్‌లో మాత్రమే కేవలం 36 నెలల్లో 300 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ మైలురాయిని చేరుకోవడం ఇది క్లినికల్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, కారుణ్య రోగుల సంరక్షణకు మా హాస్పిటల్స్ నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది” అన్నారు.

యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీ సీనియర్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి మాట్లాడుతూ.. “తెలుగు రాష్ట్రాల్లో జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయన్నారు. తీవ్రమైన కిడ్నీ గాయం నుండి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి పురోగతిని నివారించడానికి ముందస్తుగా గుర్తించడం, నివారణ వ్యూహాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్. రాజశేఖర చక్రవర్తి, నొక్కి చెప్పారు.

300 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్‌లో 225 మంది పురుషులు, 75 మంది స్త్రీ గ్రహీతలు ఉన్నారు. వీరికి 121 మంది పురుషు లు, 179 మంది మహిళా దాతల నుండి సేకరించిన కిడ్నీలను అమర్చారు. 68 మంది అంతర్జాతీ య రోగులు మూత్రపిండ మార్పిడిని పొందారు. 57 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు (60-83) సంవత్సరాల వయస్సు గల దాతల నుంచి సేకరించారు. 33 మందికి ఏబీఓ బ్లడ్ గ్రూప్ వారికి విజయవంతం గా నిర్వహించారు.

300 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్‌లో 16 మందికి జీవన్‌దాన్ సమన్వయంతో వివిధ హాస్పిటల్స్‌లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుం చి సేకరించామని డాక్టర్ రాజశేఖర చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీ నెఫ్రాలజీ వైద్యులు పి విజయ్‌వర్మ, డాక్టర్లు మహేష్, మురళీనాథ్, యూరాలజీ వైద్యు లు శ్రీనివాస్, మల్లికార్జున్‌రెడ్డి, కిడ్నీ మార్పిడి గ్రహీతలు, కిడ్నీ దాతలు పాల్గొన్నారు.