27 April, 2026 | 1:52 AM

నేడు బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

27-04-2026 12:00 AM

సతీష్ అరోరా పిలుపు

సికింద్రాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాను సారం రేపు అనగా 27- 4-2026 సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భా వ దినోత్సవం  సందర్భంగా  కూకట్‌పల్లి నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో రేపు ఉదయం 9 గంటలకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాము.

కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్లు,అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మహిళానాయకు రాళ్లు, యు వ, విద్యార్ధి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనవలసిందిగా కూకట్ పల్లి నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరా పిలుపు నిచ్చారు.