19-05-2025 12:28:30 AM
మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాల అర్బన్, మే 18 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ కు అందాల పో టీల నిర్వహణపై ఉన్న శ్రద్ధ పేద ఆడపిల్లలపై లేదని జగిత్యాల మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు.
ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ మ న ఆడబిడ్డల పెళ్ళికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వకుండా మోసం చేసి ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఎలా ఇస్తున్నావ్ అని రేవంత్ రెడ్డి ని ప్ర శ్నించారు.
నన్ను కొస్తే రూపాయి కూడ లేవన్న రేవంత్ కు అందాల పోటీలకు ఖర్చు పెడుతున్న 200 కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.ఎన్నికల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లి కానుక పేరు మీద పెళ్లికూతురుకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు ఈరోజు హామీ అమలు చేయలేక తులం బంగారం ఇయ్యలేక రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని, రాష్ట్రం కు అప్పులు ఎక్కడ పుట్టడంలేదని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారని మం డిపడ్డారు.
ఈరోజు అందాల పోటీలకు వచ్చిన సుందరీమణులకు 30 తులాల బంగారం ఇవ్వ డం ఎవరి మెప్పుకోసమని మండిపడ్డారు.తెలంగాణ ఆడబిడ్డలు నీకు ఓటు వేయడమే పాప మా అని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన పెళ్లిళ్లకు తులం బం గారం ఇవ్వాలని మహిళల పక్షాన డిమాండ్ చేశారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉందన్నారు. అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు.