29 April, 2026 | 11:24 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

క్షేమంగా ఇంటికి చేర్చే ఆటోనే బలి తీసుకున్నది..

18-06-2025 10:22 PM

ఆటో నుంచి జారిపడి విద్యార్థి మృతి..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): క్షేమంగా ఇంటికి చేర్చే స్కూల్ ఆటోనే ఆ విద్యార్థిని బలి తీసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శుభాష్ నగర్ కి చెందిన రియాహన్ రాజా(5) స్థానిక ప్రైవేటు స్కూల్ ల్లో 1వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుండి ఇంటికి స్కూల్ ఆటోలో సుభాష్ నగర్ చేరుకున్నాడు.

ఆటోకు అడ్డంగా పందులు రావడంతో ఆటో డ్రైవర్ వాటిని తప్పించే ప్రయత్నంలో వెనక కూర్చున్న విద్యార్థి ఆటో నుంచి జారిపడ్డాడు. వెనుక టైర్ కింద పడి పడిపోయాడు. ఆటో నుంచి జారిపడిన విద్యార్థిని డ్రైవర్ గమనించకపోవడంతో ఆటో వెనక టైరు కిందపడిన విద్యార్థి తలపైకి ఆటోవెనుక టైరు ఎక్కితలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే బస్తీవాసులు గాయపడిన విద్యార్థిని బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రికి హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందాడు.