calender_icon.png 13 December, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

13-12-2025 06:04:24 PM

మాగనూరు: మాగనూరు మండల పరిధిలోని వడ్వాటు గ్రామంలో లక్ష్మి కాంత్ రెడ్డి అయ్యప్ప స్వామి నివాసంలో మహేష్ గంట స్వామి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమము శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పడి పూజలో పంచామృత అభిషేకం, పసుపు కుంకుమ చందన అభిషేకాలతో పాటు అష్టోత్తరము, మహా మంగళ హారతి చేపట్టారు, శబరి గ్రీసుడికి నైవేద్యం సమర్పించారు. మాలాదారులకు సివిల్ స్వాములకు బిక్ష ప్రసాదములు వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో గురు స్వాములు అశోక్ గౌడ్, తాళంపల్లి అనిల్ గురు స్వామి, నీలా గౌడు గురుస్వామి, విజయ్ గురు స్వాములు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భజన కీర్తనలను భక్తులకు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గురు స్వాములు పవన్ గౌడు లక్ష్మణ్ గౌడ్, శ్రీధర్ గౌడ్ ,శేఖర్ గౌడ్, రంజిత్ రెడ్డి ,ఇతర గురు స్వాములు అయ్యప్ప స్వామి సివిల్ స్వాములు దేవల రోజా లక్ష్మీకాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి ,మహిపాల్ రెడ్డి ,రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు రవింద్, నర్సింలు, బసంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సుదర్శన్ గౌడ్, ఆశప్ప, మాలదారులు భక్తులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.