13-12-2025 06:02:21 PM
ఎస్పీ రోహిత్ రాజు..
ఇల్లందు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఎన్నికల నేపథ్యంలో సమీక్ష సమావేశం..
ఇల్లందు (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇల్లందు పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పంచాయతీల వారీగా ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది భాద్యతాయుతంగా మెలగాలని తెలిపారు. ఎన్నికల నియమాలని కచ్చితంగా పాటించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రభాను, ఇల్లందు సీఐ సురేష్, టేకులపల్లి సీఐ సత్యనారాయణ, గుండాల సీఐ రవీందర్, ఎస్సైలు రవూఫ్, నాగుల్ మీరా, హసీనా, రాజేందర్, సోమేశ్వర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.