12 April, 2026 | 2:13 AM

బహుజనులు ఏకమవ్వాలి

12-04-2026 12:32 AM
  1. ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపు
  2. రవీంద్రభారతిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు
  3. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ ప్రకాష్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు
  4. వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ

ముషీరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారు తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు శనివారం రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులు గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎంఎల్సీ బండా ప్రకాశ్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు హాజరై, మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ  రాష్ట్రంలో ఫ్యూడ ల్ శక్తుల పునరేకీకరణ ప్రయత్నం జరుగుతుందని, బహుజనులు ఏకమై ప్రజాప్రభు త్వాన్ని నిలబెట్టుకో వాలన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సామాజిక న్యాయం కోసం ప్రజాప్రభుత్వం నిటారుగా నిలబడి ఉంటుందన్నారు. ద్రవిడ రాష్ట్రాలను బలహీన పరిచేందుకు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో భారీగా తగ్గింపులు చేశారని డిప్యూటీ సీఎం వివరించారు.

తెలంగా ణ నుంచి పన్నుల రూపేనా ఒక రూపాయి కేంద్రానికి వెళితే తిరిగి రాష్ట్రానికి 37 పైసలు మాత్రమే వస్తుందని, తమిళనాడు నుంచి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి 29 పైసలు, అదే ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్ నుంచి కేంద్రానికి రూపాయి వెళితే, తిరిగి కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి రూ.6.53 వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి పన్నుల వాటాల రూపంలో రూ.2.17 వెళుతున్నాయని డిప్యూటీ సీఎం చెప్పారు. నియోజక వర్గాల పునర్విభజనలో కులగణనను పరిగణనలోకి తీసుకోకపోతే యావత్ భారత దేశంలోని బలహీనవర్గాలకు నష్టం జరుగుతుందని, మనకోసం మనం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్ చట్టాన్ని కాంగ్రె స్ అమల్లోకి తీసుకువచ్చింది. బీసీ సబ్ ప్లాన్ డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చిం ది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఆలోచన చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ సామాజిక స్పృహతో పాలన అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

మహాత్మ ఫూలే ఆలోచనలను ఏ చిన్న అవకాశం దక్కినా, ప్రతి సందర్భంలో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఓసీ అన్ని వర్గాల పిల్లలు 12వ తరగతి వరకు ఒకేచోట చదువుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

అధికారంలోకి రాగానే 40 శాతం డైట్ 200% కాస్మోటిక్ చార్జీలు పెంచామని, మన బిడ్డలు ఎవరు అర్ధాకలితో ఉండకూడదన్నారు. అందుకే ప్రతి రోజు నాణ్యమైన డైట్‌ను అందించడమే కాదు వాటిని పర్యవేక్షించేందుకూ చర్యలు తీసుకున్నామన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి మండలస్థాయి అధికారి వరకు, సీఎం నుంచి సర్పంచి వరకు గురుకులాలు సంక్షే మ వసతి గృహాలను సందర్శించాలని, అవసరమైతే అక్కడే నిద్రించాలని నిబంధన పెట్టి, ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు.

జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం పథకం ప్రారంభిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 15 కోట్లతో సకల సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభి స్తున్నామని ప్రకటించారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంటేనే అంతరాలు లేని సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మిన ప్రజాప్రభుత్వం తాజా బడ్జెట్‌లో విద్యాశాఖకు 13.5% నిధులు కేటాయించామని, ఇది విద్య పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, ఆలోచన అని అన్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

మహాత్మా జ్యోతిరావుఫూలే జయంతి వేడుకల్లో బీసీ సంఘా ల నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫూలే ఆశయాలను స్మరించుకోవాల్సిన చోట నాయకులు ఇలా పిడిగుద్దులు గుద్దుకోవడం చర్చనీయాంశమైంది. వేడుకలకు కేటాయించిన నిధుల వినియోగంపై మొదటి నుంచీ బీసీ సంఘా ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యా యి.

ఈ క్రమంలో నిధుల కేటాయింపులో, ఖర్చు చేయడంలో భారీగా అవినీతి జరిగిందని ఒకవర్గం ఆరోపించడంతో గొడవ మొదలైంది. ముఖ్యంగా ఆర్ కృష్ణ య్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, మేకపోతుల నరేందర్‌గౌడ్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, జయంతి ఉత్సవ కమిటీ సలహా దారు జాజుల, విక్రమ్, గుజ్జ కృష్ణ, రాజేందర్, నీల వెంకటేష్, శ్రీనివాస్, ఆళ్ల రామకృష్ణ, నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.