సోదరి కూతురిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్
నల్లగొండ జిల్లా వేములపల్లిలో ఘటన
వేములపల్లి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): తండ్రి స్థానంలో ఉండి అన్నీ తానై పెంచాల్సిన మేనమామే తన అక్క కూతురిపై అఘాయిత్యానికి పాల్పడగా నల్లగొండ జిల్లా వేముల పల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. సీఐపిఎన్‌డి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన కోడి రెక్క నా గేంద్రకి ఒక సోదరి ఉంది.
ఆ సోదరి, ఆమె భర్త బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఆటో తోలుతూ, కూలీనాలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి కుమార్తెను అన్న నాగేంద్ర వద్ద ఉంచి చదివిస్తున్నారన్నారు. ఇదే అదునుగా భావించిన నాగేంద్ర బాలికను లైంగికంగా లొంగదీసుకున్నాడు. దీంతో బాధితురాలు ఎల్బీనగర్ పోలీ స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో పోలీసులు వేములపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారన్నారు. నాగేంద్రను అరెస్టు చేశారు.




