12 June, 2026 | 6:45 PM

ఢిల్లీ దిగి వచ్చేలా బీసీ ఉద్యమం

15-12-2025 12:35 AM
  1. చలో ఢిల్లీతోనైనా కేంద్రం కండ్లు తెరవాలి 
  2. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 
  3. ‘చలో ఢిల్లీ’కి బయలుదేరిన బీసీ నేతలు 
  4. జెండా ఊపి సాగనంపిన జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ గల్లీలో ఉద్యమించినట్టుగానే 15వ తేదీ నుంచి ఢిల్లీలో ఉద్యమిస్తామని, బీసీల చలో ఢిల్లీ ద్వారా ఢిల్లీ దిగివచ్చేలా బీసీల పోరా టం ఉంటుందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ జేఏసీ ఈ నెల 15, 16 తేదీలలో చేపట్టనున్న చలో ఢిల్లీ కా ర్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఆదివారం రాష్ట్రం నుంచి సికింద్రాబాద్‌లో ఉదయం రైలు ఎక్కి వందలాదిమంది ఉద్యమకారులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీకి వెళ్తున్న ఉద్యమకారులను జాజుల శ్రీనివాస్‌గౌడ్ బీసీ జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 పెంచుతూ చేసిన చట్టాన్ని ఈ పార్లమెం ట్ సమావేశాల్లోని ఆమోదించాలని, దేశవ్యాప్తంగా బీసీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఉన్న 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తివేలనే ప్రధాని డి మాండ్‌లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్ర మంతోనైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. త మ రెండు, మూడు రోజుల ఢిల్లీ పర్యటనతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులను కలిసి బీసీ బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తామని తెలిపారు.

ఢిల్లీ వెళ్లిన బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బి మణి మంజరి, కాటేపల్లి వీరస్వామి, కౌల జగన్నా థం, నందగోపాల్, గూడూరు భాస్కర్, స్వర్ణ, గౌతమి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాసచారి, బండి గారి రాజు ఉన్నారు.