మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి
- రాబోయే ఎన్నికలు బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలి
- లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు
- తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
ముషీరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయని, చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తరువాతనే ఎన్నికలకు పోవాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 కేసు హైకోర్టులో విచారణకు బెంచ్‌పైకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సమర్థవతమైన న్యాయవాదులతో బలమైన వాద నలు వినిపించాలని కోరారు.
అడ్వకేట్ జనరల్ ఓసీ కావడం వల్లే ఆలస్యం అవుతుంద ని ఆరోపించారు. ఈ కేసులో బీసీల న్యాయవాదులతో వాదించాలన్నారు. బీసీ నేతలు నీల వెంకటేష్ ముది-రాజ్, భీం రాజ్, రాందే వ్‌మోడీ, టి రాజ్‌కుమార్, నరేష్‌గౌడ్, రమేష్ యాదవ్, అంజిగౌడ్, నిఖిల్, అఖిల్, ఆశిష్ గౌడ్, సుప్రజా, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.






