బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలి!
డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ :
* రాష్ర్టంలో బీసీల అభివృద్ధికి ఒక సబ్ ప్లాన్ రూపొందించి 2026--27 ఆర్థిక సంవత్సరంలో అందరికీ వర్తించే సాధారణ కేటాయింపులు పోను ప్రణాళికా బడ్జెట్‌లో బీసీలకు కనీసం 29 శాతం నిధులు కేటాయించాలి.
బీసీ సబ్‌ప్లాన్ అనేది వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలోనే, బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ నిధులను కేటాయించి, అవి వేరే ఇతర పనులకు మళ్లించకుండా కేవలం బీసీల సంక్షేమం కోసమే ఖర్చు చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. సాధారణంగా బడ్జెట్ లో బీసీలకు నిధులు కేటాయించినా, అవసరమైనప్పుడు ప్రభుత్వం ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించే అవకాశం ఉంటుంది.
కానీ సబ్ ప్లాన్ చట్టం వస్తే, బీసీల జనాభా శాతానికి తగ్గట్టుగా బడ్జెట్‌లో కచ్చితమైన వా టా కేటాయించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బీసీల కోసం కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే, అవి మరుసటి ఏ డాదికి బదిలీ అవుతాయే తప్ప ఇతర శాఖలకు వెళ్లవు. బీసీల్లోని అనేక కులాలు నిర్దిష్ట మైన వృత్తులపై ఆధారపడి ఉన్నాయి.
సబ్ ప్లాన్ నిధులతో ఈ వృత్తులకు కావాల్సిన ఆ ధునిక యంత్రాలు, మార్కెటింగ్ సదుపాయాలు, తక్కువ వడ్డీతో రుణాలు నేరుగా అందుతాయి. బీసీ విద్యార్థుల కోసం మరి న్ని వసతి గృహాలు, గురుకుల పాఠశాలల నిర్మాణం, విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్‌లను పెంచడానికి ఈ నిధులు తోడ్పడ తాయి. బీసీ సబ్‌ప్లాన్ అమలు కావాలంటే కేవలం బడ్జెట్ కేటాయింపులు మాత్రమే స రిపోవు, దానికి చట్టబద్ధత అవసరం.
ఎక్కడేసిన గొంగళి అక్కడే..
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి, అమోదించాలని బీసీ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ సబ్‌ప్లాన్ మొదటి అసెంబ్లీ స మావేశాల్లోనే చట్టబద్దమైన హోదాతో స మాన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇ చ్చింది. కానీ, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల పరిస్థితి నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అలాగే అన్న చందంగానే ఉంది.
దశాబ్దాల నిర్లక్ష్యం, అరకొర బడ్జె ట్ కేటాయింపులు, అమలుకు నోచుకోని కమిషన్ల నివేదికల మధ్య బీసీల బతుకులు చితికిపోతున్నాయి. ఈ వివక్షకు తెరపడాలం టే శాస్త్రీయమైన గణాంకాలతో కూడిన బీసీ సబ్ ప్లాన్’ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ. 20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. లక్ష కో ట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ తమ మ్యానిపెస్టోలో పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీలకు అమలవు తున్న సబ్ ప్లాన్ తరహలోనే బీసీల కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్ తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. రాష్ర్టంలోని బీసీలకు సమాన హక్కులు కల్పిస్తానని హామి ఇచ్చిం ది. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు. బడ్జెట్ కేటాయింపులు గడిచిన సంవత్సరాల్లో చూసుకుంటే కేంద్ర బడ్జెట్‌లో 0.3 శాతం, రాష్ట్రాల్లో 4 శాతానికి మించి జరగడం లేదు.
పేరుకే కమిషన్లు..
బీసీల్లో 60 శాతానికి పైగా దారిద్య్రరేఖ కు దిగువన ఉన్నారు. దేశంలోని టాప్ వెయ్యి కంపెనీల బోర్డుల్లో బీసీల వాటా 3 శాతం కంటే తక్కువే ఉంది. న్యాయశాఖలో ఆరుశాతం, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కేవ లం 8 శాతం మాత్రమే ఉన్నారు. పదకొం డో పంచవర్ష ప్రణాళిక మిడ్ టర్మ్ నివేదికలో ‘ఓబీసీ కులాల వారీ, జనాభా గణాంక వివరాలు, సామాజిక-ఆర్థిక నేపథ్య గణాంకాలు మా వద్ద అందుబాటులో లేని కార ణంగా ఓబీసీల అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించలేకపోతున్నామని పే ర్కొంది.
అందుకే కేంద్రం ప్రతీ ఆర్థిక సంవత్సరం లక్షల కోట్ల బడ్జెట్‌ను రూపొందించి నా ఓబీసీ కులాల వారీ, జనాభా గణాంక వివరాలు మాత్రం రూపొందించడం లేదు. అందుకే అనేక సంవత్సరాల్లో కేవలం ఒక ఓబీసీ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కొన్ని స్కాలర్‌షిప్‌లు, కొన్ని కేంద్రీ య సంస్థల ఏర్పాటు తప్ప మరేవీ జరగలేదు. ప్రణాళిక బడ్జెట్‌లోనూ అన్నీ కలిపి 0.5 శాతం దాటకపోవడం గమనార్హం. కేం ద్రం వేసిన కాకా కలేల్కెర్, మండల్ కమిషన్లు ఓబీసీల అబివృద్ధి ప్రణాళికలకు సం బంధించిన సిఫారసులు ఇప్పటివరకు అమలు చేయలేదు.
కూలిపోతున్న వృత్తి..
రాష్ట్రస్థాయిలో మొదటగా వేసిన కమిషన్ బీసీ కులాలను గుర్తించి వారి మధ్య కూ డా ఉన్న అసమానతలను ఎ, బి, సి, డి, ఇ లుగా వర్గీకరించి బీసీలకు 36 శాతం ఇ య్యాలని నిర్ణయించింది. కాని అటు కేం ద్రం, ఇటు రాష్ర్టంలోని ప్రభుత్వాలు కమిషన్ల ప్రతిపాదనలను అమలు జరపలేదు. ఆయా నివేదికల్లో ఓబీసీలకు సంబంధించిన వేలాది కులాలు దారిద్య్రరేఖ దిగువన ఉండ టం, సామాజికంగా, ఆర్థికంగా అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారన్న అంశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ వారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొం దించడంలో విఫలమయ్యాయి.
బీసీల కనీస అవసరాలను తీర్చే క్రమంలో అభివృద్ధి కా ర్యక్రమాలు చేపట్టడం కోసం ఎలాంటి ప్ర ణాళికలు వేయకపోవడం అగ్రకులాలకు చెందిన పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా చూపిస్తున్నది. ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు వె న్నెముకగా ఉన్న వృత్తి కులాలు ప్రపంచీకరణ విధానాల వల్ల కుప్పకూలాయి.
వ్యవ సాయం, పశుపోషణ, వస్తు ఉత్పత్తి వంటి రంగాల్లో ఉన్న బీసీలకు ప్రభుత్వాల నుంచి పెట్టుబడి సాయం అందలేదు. స్వయం ఉ పాధి పొందుతున్న బీసీల్లో కేవలం 7 శాతం మందికి మాత్రమే బ్యాంక్ రుణాలు అందుతున్నాయి. మిగిలిన 93 శాతం మంది నేటికీ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుని ఆత్మహత్యలు, వలసల బాట పడుతున్నారు.
మానిటరింగ్ వ్యవస్థ..
తెలంగాణ రాష్ర్టంలో గత పదేళ్లలో సు మారు రూ. 28 లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తే, అందులో బీసీలకు వాస్తవంగా ఖర్చు చేసింది కేవలం రూ. 31,713 కోట్లు మాత్రమే. అంటే మొత్తం బడ్జెట్‌లో ఇది అతి స్వల్పమని చెప్పొచ్చు. బీసీల కోసం కేటాయించిన బడ్జెట్‌ను ఇతర పథకాలకు మళ్లిం చడం మరో దారుణం. బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మిలో ఈబీసీ వాటా వంటివి కూ డా బీసీల ఖాతాలోనే చూపడం వల్ల అసలైన వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరు గుతున్నది. గడిచిన రెండేళ్లలో 24 బీసీ కార్పొరేషన్లకు రూపాయి నిధులు కూడా విడుదల కాకపోవడం ప్రభుత్వాల ప్రాధాన్యతలను ప్రశ్నార్థకం చేస్తోంది.
సామాజిక న్యాయం..
రాష్ర్టంలో బీసీల అభివృద్ధికి ఒక ‘సబ్ ప్లాన్’ రూపొందించి 2026--27 ఆర్థిక సం వత్సరంలో అందరికీ వర్తించే సాధారణ కే టాయింపులు పోను ప్రణాళికా బడ్జెట్‌లో బీసీలకు కనీసం 29 శాతం నిధులు కేటాయించాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం కనీసం రూ. 87 వేల కోట్లు కేటాయించాలి.
2029--30 బడ్జెట్‌లో బీసీల జనాభా దామాషా ప్రకారం 50 శాతం నిధులను కేటాయిస్తూ ‘బీసీ ప్రత్యేక ప్లాన్’ అమలు చేయాలి. బీసీ జాబితాలోని వివిధ గ్రూపు ల్లో ఉన్న కులాల కనీస అవసరాలు అభివృద్ధి, ప్రాతిపదికగా ఆయా వర్గాలకు నిధులు కేటాయించాలి. బీసీ కులాలన్నింటికీ ప్రాధాన్యతా క్రమంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించే ప్రణాళికను రూపొందించాలి. బీసీ కులాలకు సంబంధించిన వృత్తు ల్లో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల చొరబాటును నిషేదించాలి.
వారి వృత్తుల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలి. కులాల, వృత్తుల కో సం ప్రత్యేక ఫెడరేషన్లను ఏర్పాటు చేసి, పనితీరును పరీశీలించడానికి సింగిల్ మానిట రింగ్ సంస్థను ఏర్పాటు చేయాలి. ఈ ఫెడరేషన్ల నిర్వహణ బాధ్యతను సంబంధిత కు లాల వ్యక్తులకే అప్పగించాలి.
బీసీలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైనప్పటికీ అభివృద్ధి ఫలాల్లో, రాజకీయాల్లో భాగస్వామ్యం తక్కువగానే ఉంటుంది. సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన కోసం బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేయడం అత్యవసరం. ఇది కేవలం ఒక వర్గం అభ్యర్థన కాదు, రాజ్యాంగ హామీల అమలుకోసం తీసుకోవాల్సిన చారిత్రక నిర్ణయం.
వ్యాసకర్త సెల్: 9177566741




