16-07-2025 12:00:00 AM
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే నటిగా గుర్తింపు తెచ్చుకోవడం.. అందాల ఆరబోతతో స్టార్‌డమ్‌ను దక్కించుకోవటం విద్యా బాలన్‌కు ఎంతో కాలం పట్టలేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరో లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా, మహిళా ప్రాధాన్య చిత్రాలకు ఆమె మాత్రమే న్యాయం చేస్తుందనేంతగా పేరు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు తన సమస్యను అధిగమించిన ఆ బ్యూటీ నలభైల్లోనూ తరగని అందంతో యువతను కళ్లు తిప్పు కోకుండా చేస్తూ తన అందంతో ఆకర్షిస్తోందిప్పుడు! నాలుగు పదుల్లోనూ ఇరవయ్యేళ్ల పడుచులతో సరిసమానంగా అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా మారుతుంటారు.
ఇప్పుడు విద్యాబాలన్ అదే చేస్తోంది. నాలుగు పదుల వయసు దాటిన ఈ ‘డర్టీ పిక్చర్’ బ్యూటీ తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘పికాక్’ ముఖచిత్రంపై అందాల ప్రదర్శనతో కనువిందు చేసింది. వయసు సగానికి పైగా తగ్గినట్టు అనిపించే మేకోవర్‌తో చూపు తిప్పుకోనీయడంలేదు. విద్యాబాలన్‌ను ఇలా చూసిన నెటిజన్స్.. 15 ఏళ్ల క్రితం ‘డర్టీ పిక్చర్’లోని శృంగార తార మళ్లీ గుర్తుకొ స్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోయడం చూస్తుంటే.. ఇండస్ట్రీలో మరో పదేళ్లూ టాప్ స్టార్‌గా ఆమెకు ఢోకా లేదని మరికొందరు రాసిచ్చేస్తున్నారు.