calender_icon.png 16 July, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన చుట్టూ జరుగుతున్న అనుభూతినిచ్చే కథ ఇది

16-07-2025 12:00:00 AM

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న రూరల్ కామెడీ చిత్రం ‘కొత్తపల్లిలో ఒక ప్పుడు’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ నటి ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి విలేకరులతో చిత్ర విశేషాలను పంచు కున్నారు. “-నాకు డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది.

చిన్నప్పుడు నుంచి సినిమాలు అంటే పిచ్చి. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నా. అమెరికాలో యాక్టింగ్ క్లాసెస్‌కి వెళ్లా. ఫిలిం మేకింగ్ షార్ట్ కోర్సు చేశా. డైరెక్షన్ చాలా డిఫి కల్ట్ క్రాఫ్ట్. ప్రొడక్షన్ చేసి నేర్చుకోవా లని నిర్ణయిం చకున్నా. నా గత రెండు సినిమాలతో అన్ని క్రాఫ్టుల మీద అనుభవం వచ్చింది. నా పాత్ర చాలా వినోదం పంచుతుంది. ఊర్లో ఉండే మహిళలు కాస్త టఫ్‌గా ఉంటారు. నాది కూడా అలాంటి టఫ్ క్యారెక్టర్. నా పర్సనాలిటీకి చాలా డిఫరెంట్‌గా ఉండే క్యారెక్టర్ ఇది.

ఇందులో నాకు రెండు అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. ‘పుష్ప’లో జాతర సీన్ లాంటి ఒక పవర్‌ఫుల్ సీక్వెన్స్ ఉంది.   ఈ సినిమా చూస్తున్నప్పుడు జంధ్యాల సినిమా లాగా మన చుట్టూ జరుగుతున్న కథలాగే అనిపిస్తుంది. హారర్ కాదు కానీ, ఇందులో సూపర్ నేచురల్ ఎలి మెంట్ ఉంది. మనకు గ్రామదేవతలపై చాలా విశ్వాసం ఉంటుంది. ఈ నమ్మకాల మీద మొదట్నుంచి నాకూ ఆసక్తే. ఈ సినిమాలో అలాంటి ఓ నమ్మకాన్ని చాలా న్యూట్రల్‌గా చూపించాం.

-నాకు తెలుగు సినిమా లంటే చాలా ఇష్టం. ఒక మంచి కథ చెప్తే తెలుగు ప్రేక్షకులు గొప్ప మనసుతో చూస్తారు. ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలను అద్భుతంగా ఆదరించారు. ఈ సినిమానూ ఆదరించి ప్రోత్సహిస్తా రనే నమ్మకం ఉంది. -ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే చేశాను. ఇకపై అవకాశం వస్తే సిటీ బ్యాక్‌డ్రాప్‌తో చేయాలనుంది. -ఏదైనా సాధించా లంటే విల్ పవర్ ఉండాలి.

ఎన్ని కష్టాలు వచ్చినా మనం అనుకున్నది సాధించ గలం. అది ఈ సినిమా నేర్పింది. ఈ సిని మాకు అతిపెద్ద సవాల్ సమయమే. సినిమా చేస్తూనే మెడిసిన్‌కు గ్యాప్ ఇవ్వడం పోస్ట్ ప్రొడక్షన్ చూసుకో వడం ఇవన్నీ కూడా ఛాలెం జింగ్‌గా అనిపించింది. యాక్షన్ సినిమా చేయాలని ఎప్పటినుంచో కోరిక. ఒక మంచి మార్షల్ ఆర్ట్ ఫిలిం చేయాలనే ఉంది.