20-01-2026 01:30:57 AM
వరుణ్‌తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటివరకు ‘వీటీ15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ ఇందులో ‘కనకరాజు’గా అలరించనున్నారు.
ఈ సినిమా ‘కొరియన్ కనకరాజు’ అనే పేరుతో రానుంది. సోమవారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటి ల్‌ను గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. ఈ టీజ ర్‌లో ముఖ్యంగా సత్య ‘కనకరాజు వచ్చేసినాడమ్మీ..’ అంటూ రాయలసీమ యాస లో చెప్పడం.. ‘నేను తిరిగి వచ్చాను’ అంటూ కొరియన్ భాషలో డైలాగ్ చెప్తూ వరుణ్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్లు ఇదే గ్లింప్స్ లో మేకర్స్ వెల్లడించారు. వరు ణ్ ఈ చిత్రం కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. రితి కా నాయిక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సి నిమాలో సత్య కీల క పాత్రలో నటిస్తున్నా రు. ఈ చిత్రానికి సంగీతం: తమన్; డీవోపీ: మనోజ్‌రెడ్డి కటసాని.