1 July, 2026 | 7:08 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

భూ సమస్యల శాశ్వత పరిష్కారమే భూభారతి చట్టం

12-06-2025 05:01 PM

కొండారెడ్డిపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం శాశ్వతంగా భూ సమస్యలకు పరిష్కారం చూపనుందని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్(District Collector Badavath Santosh) అన్నారు. గురువారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి భూ సమస్యకు స్థిరమైన పరిష్కారం అందించేందుకు రెవెన్యూ సదస్సులు గొప్ప వేదిక అవుతున్నాయన్నారు. రైతులు వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు.

వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్‌ పరిశీలన పూర్తయ్యాక వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, వారి సమస్యలను తెలుసుకొని, భూభారతి చట్టంలోని అంశాలను వివరించారు. సదస్సులో రెవెన్యూ అధికారులు ప్రింటెడ్ దరఖాస్తు ప్రొఫార్మాలను అందజేశారు. హెల్ప్ డెస్క్‌ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వంగూరు తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి,  రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.