కిసాన్ నగర్ ఘటనతో బీజేపీకి సంబంధం లేదు
రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సునీల్ రావు
ముకరంపుర, ఆగస్టు 11(విజయ క్రాంతి): కిసాన్ నగర్ ఘటనతో బిజెపికి ఎటువంటి సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ లో మంగళవారం విలేకరుల స మావేశంలో మాట్లాడుతూ కిసాన్ నగర్ ప్రాంతంలో జరిగిన గొడవ పై స్పందించా రు. వ్యక్తిగత తగాదాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీ పార్టీకి అంట గడుతువాఖ్యలు చేయడం పట్ల మండిపడ్డారు.
బీజేపి కార్పొరేటర్ సోమిడి వేణును గతంలో కారుతో డీ కొట్టి గాయపరిచిన,ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మేము ఎవరిపై నిందారోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయనపై చేసిన దాడిని వ్యక్తిగత దాడిగానే భావించాం తప్పా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు అంట గట్టే ప్రయత్నం చేయలేదని ద్వజమెత్తారు. ఈ ఘటన విషయంలో ప్రధానంగా మా నాయకులు బండి సంజయ్ కుమార్ పేరును వాడటం ఏంటని ప్రశ్నించారు.
ఎక్కడో జరిగిన వ్యక్తిగత గొడవలు సాకుగా మలుచుకొని భారతీయ జనతా పార్టీపై,మా నాయకులపై నిందెలు వేయడం ఎంతవరకు సబబని అన్నారు బీజేపీ పార్టీ గానీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గానీ ధాడుల ను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, ఓంటెల సత్యనా రాయణ రెడ్డి, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, పొన్నం మొండ య్య గౌడ్, బండారి వేణు, కె ఏపిపి చంద్ర, దేవసాని సత్యనారాయణ, నాంపల్లి శ్రీనివాస్, కర్రె అనిల్, తోట అనిల్, కో ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, చిగు రు రవి, నాయకులు పండుగ నాగరాజు, వెంకట్ రెడ్డి, శివ, చంద్రమౌళి, అనిల్, హ మీద్ తదితరులు పాల్గొన్నారు.






