‘నిరుద్యోగుల మాటెత్తే అర్హత బీజేపీకి లేదు’
28-07-2026 12:00 AM
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీజేపికి లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. సోమవారం ఆయన సీఎల్పీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ యువతకు చట్ట సభలకు పోటీ చేసే వయసును 21 ఏండ్లకు తగ్గించాలని, ఒక మంచి ఆలోచనకు తెలంగాణ నాంది కావాలని రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తుంటే..అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు.






