calender_icon.png 6 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంధం చారిత్రకం!

06-12-2025 12:46:45 AM

భారత్, రష్యా మధ్య 2030 వరకు వాణిజ్య విస్తరణకు ఒప్పందం

  1. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యం
  2. భారత్‌కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ
  3. యూరియా, షిప్పింగ్, ఆహార భద్రత రంగాల్లో కీలక అవగాహన ఒప్పందాలు
  4. ఇండియా నేతృత్వంలోని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌లో చేరనున్న రష్యా
  5. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. శాంతి స్థాపనకు కలిసి పనిచేసేందుకు అంగీకారం
  6. హైదరాబాద్ హౌజ్‌లో ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక బంధం మరో చారిత్రక మైలురాయికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయి కి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

2030 వరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఉద్దేశించిన ఒక సమగ్ర ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరువురు నేతలు ఆమోదం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హౌస్‌లో భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీ అనంత రం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడి యా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అంబరాన్నంటే లక్ష్యాలు.. 

ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాలు అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. 2025 నాటికి పరస్పర పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా యురేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయ న తెలిపారు. ఈ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, భారత్-రష్యా మధ్య వాణిజ్య సం బంధాలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

ఇంధనం నుంచి ఎరువుల వరకు.. 

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు.భారత్- రష్యా ల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం.. మేకిన్ ఇండియాకు మా మ ద్దతు ఉంటుందని పుతిన్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా, ఎరువుల రంగంలో ఒక పెద్ద ముందడుగు పడింది. రష్యాకు చెందిన ప్రముఖ సంస్థ ’యురాల్కెమ్’తో భారతీయ కంపెనీలు కలిసి రష్యాలో ఒక యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఇది ద్వైపాక్షిక పారిశ్రామిక సహకారంలో ఒక ముఖ్యమైన పరి ణామం. దీనివల్ల భారత రైతాంగానికి ఎరువుల సరఫరా మెరుగుపడనుంది. వీటితో పాటు ఆహార భద్రత, నౌకాయాన శిక్షణ, వైద్యం, వినియోగదారుల రక్షణ, పోర్టులు, షిప్పింగ్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఒప్పందాలు జరిగా యి.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండరడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆహార ఉత్పత్తుల వాణిజ్యానికి మరింత ఊ తమిస్తుంది. అదే విధంగా ఉగ్రవాదంపై ఉ మ్మడి పోరాటం చేసి శాంతి స్థాపనకు కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలుపుకున్నారు.

భారత్‌కు రష్యా మిత్రదేశం : మోదీ

భారత్‌కు నిజమైన మిత్రదేశం రష్యా అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏ కష్టం వచ్చిన ముందు కాల్ వచ్చేది మాస్కో నుంచేనని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన నాటి నుంచి పుతిన్ అసలైన స్నేహితుడిలా అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తనతో పంచుకున్నారని ప్రధాని ప్రశంసించారు. ఈ నమ్మకమే అసలైన బలమని వ్యాఖ్యానించారు. శాంతిస్థాపనతోనే దేశాలు పురోగమిస్తాయని తెలిపారు.

భారత్-రష్యాలు కలిసికట్టుగా ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిస్తాయని అన్నారు. ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలతో ప్రపం చం మళ్లీ శాంతివైపు మళ్లుతుందన్న నమ్మ కం తనకు ఉందన్నారు.  భారత్-రష్యా దౌత్యబం ధం వెనుకున్న దార్శనికత కూడా గొప్పదని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ప్ర పంచం అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు కలిసికట్టుగా మరి న్ని ఉన్న త శిఖరాలు చేరుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు.

భారత్ ప్రస్తుతం తటస్థ వైఖరి కాదని, తాము శాంతిసౌభాగ్యాల పక్షాన ఉంటామని తెలిపారు.  అం తర్జాతీయంగానూ సహకారాన్ని విస్తరిస్తూ, భారత్ నేతృత్వంలో ఏర్పాటైన ‘ఇంట ర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ ఫ్రేమ్వర్క్ ఒప్పందంలో చేరేందుకు రష్యా అంగీకరించింది.

ఇది పర్యావరణ పరిరక్షణలో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం. మొ త్తంగా ఈ భేటీ, కేవలం రక్షణ, ఇంధనం వంటి సంప్రదాయ రంగాలకే పరిమితం కా కుండా, ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ రం గాల్లోనూ భారత్-రష్యా బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు బలమైన పునాది వేసిం ది’. అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.  

పుతిన్‌కు అధికారిక స్వాగతం

తన పర్యటనలో భాగంగా పుతిన్ ముం దుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు రాష్ట్రపతి  ముర్ము, ప్రధాని మోదీ అధికారిక స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరించా రు. ఈ సందర్బంగా ఇరు దేశాల నేతలను పుతిన్‌కు మోదీ పరిచయం చేశారు.

మహాత్ముడికి నివాళి

అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.  ఆయన రాజ్‌ఘాట్‌ను సంద ర్శించి జాతిపిత మహా త్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సం తకం చేశారు. 

చర్చలు ఫలవంతం.. ఆత్మీయతకు ధన్యవాదాలు

  1. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
  2. భారత్‌లో ముగిసిన రష్యా అధ్యక్షుడి పర్యటన
  3. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 5 : ‘భారత ప్రతినిధులతో జరిపిన చర్చలు చాలా ఫలవంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. అంతకుముందు రోజు రాత్రి ప్రధాని మోదీ తన నివాసంలో ఇచ్చిన విం దులో ఏకాంతంగా సమావేశమ య్యాం. ఆ ఆత్మీయతకు నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఇచ్చిన ప్రత్యేక విందుకు హాజరయ్యారు.

అనంతరం ఆయన నేరుగా విమనాశ్రయానికి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆయనకు వీ డ్కోలు పలికారు. దీంతో రష్యా అధ్యక్షుడి భారత్ రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని, కీలక ప్రాజెక్టుల పురోగతిని తాము నిరంతరం పర్యవేక్షిస్తుంటామని ఈ సందర్భంగా ఆయన స్ప ష్టం చేశారు. అంతకుముందు పుతి న్ తాను బస చేసిన హోటల్లోని సి బ్బందితో  ఫొటో దిగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.