calender_icon.png 15 January, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే దంపతులు

15-01-2026 01:55:43 AM

మహిళలతో కలిసి ముగ్గులు వేసిన ఎమ్మెల్యే సతీమణి

ఆదిలాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని రాజుర గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండుగ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మొగ్గుల పోటీలు ముగిశాయి. గ్రామంలోని మహిళలు, యువతులు, చిన్నారులు ఎంతో ఆనందోత్సవాల మధ్య పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు.

మహిళలతో కలిసి ఎమ్మెల్యే సతీమణి ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గులు పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు మొదటి బహుమతిగా రాథోడ్ శ్రీ ప్రియ, రెండవ బహుమతిగా మధుమిత, మూడవ బహుమతిగా రాధిక లకు  ఎమ్మెల్యే దంపతులు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎల్లప్పుడూ గ్రామమంతా కలిసిక ట్టుగా పండుగలు జరుపుకోవాలని, ఎంతో ఉత్సాహంగా యువతులు ముగ్గుల పోటీల్లో హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాదవ్ గణేష్, సర్పంచులు సరోజి, జాదవ్ సునీత రమేష్, సవాయి రాం, జాదవ్ ధన్ రాజ్, రాహుల్ తదితరులు ఉన్నారు.