calender_icon.png 1 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తాం

01-11-2025 12:22:51 AM

  1. ఈబీసీలకు రూ.10లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు
  2. కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మారుస్తాం
  3. కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య
  4. బీహార్‌లో ఎన్డీయే కూటమి వరాల మ్యానిఫెస్టో విడుదల

పాట్నా, అక్టోబర్ 31 : బీహార్‌లో కోటి ప్ర భుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని అధికార ఎన్డీయే(నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) కూట మి ప్రకటించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ శుక్రవా రం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్జేపీ  చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి ‘సంకల్ప పత్ర’ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యంగా వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. 

ఏ డాదికి రూ. లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా మా ర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు రూ.2లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఈబీసీలకు రూ.10లక్షల వరకు ఆర్థిక ప్రో త్సాహకాలు, కర్పూరీ ఠాకూర్ కిసాన్ స మ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 9వేలు పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామన్నారు.

కేజీ టు పీజీ నాణ్యమైన ఉచిత విద్యను అం దిస్తామని తెలిపారు. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవ ర్లను ఆకట్టుకునేందుకు ఆర్థికసాయం అందజే స్తామ ని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ.50లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు.