calender_icon.png 8 October, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగిలిన నీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయాలి

08-10-2025 12:07:06 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో ప్రధాన రహదారి పై మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో నీరు వృధాగా పోతుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

అధికారులతో చర్చించి వెంటనే మరమ్మతులు చేసి నీరు వృధా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మాజీ చైర్మన్ పావని యాదవ్ అధికారులకు తెలుపగా సానుకూలంగా స్పందించి వెంటనే నీరు వృధా పోకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈకార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకటనారాయణ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు సత్తిరెడ్డి, ఆంజనేయులు,  వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ,  మిషన్ భగీరథ ఏఈ, హెచ్ ఆర్ డి సి అధికారులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.