బస్సును రెగ్యులర్‌గా నడిపించాలి
14-04-2026 12:10 AM
బచ్చన్నపేట, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మండలంలో ని పడమటి కేశపూర్ గ్రామంలో జనగాం నుండి వచ్చే బస్సు రెగ్యులర్గా నడిపించే విధంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గిద్దల రమేష్. మాట్లాడుతూ విద్యార్థులకు సెలవులు వచ్చిన తర్వాత బస్సు రావడం బంద్ అవుతుందని,
దానివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ముందస్తుగానే ఎంపీ ని కలిసి వివరించడం జరిగిందని అన్నారు. వెంటనే స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ ఆర్టీసీ ఎండి తో మాట్లాడి బస్సును రెగ్యులర్గా నడిపించాలని తెలియజేశారు. విద్యార్థుల కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సును నిరంతరం నడిపించాలని కోరారు




