20-08-2025 12:07:45 AM
జగిత్యాల అర్బన్, ఆగస్టు 19(విజయ క్రాంతి): రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే విషయం లో తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు.రాయికల్ మండలం లోని బోర్నపల్లి వరద తీవ్రతను రైతులు, గ్రామస్తులతో కలిసి ప రిశీలించి, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
అనంతరం రాయికల్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ యూ రియా విషయంలోకేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు తగినంత యూరియా సరఫరా చేసి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం గ్రామాలలో ఒక్క ఇల్లు కూడా మంజూరు ఇవ్వలేదని ,హౌసింగ్ శాఖను కూడా నిర్వీర్యం చేసిందన్నారు.గత ప్రభుత్వం రు.3 లక్షలు ఇంటి కోసం సహాయం అందిస్తామని హామీ ఇచ్చి,అది అమలు చేయలేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రు. 5 లక్షల తో మొదటి విడతలోనే నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.