07-12-2025 01:27:12 AM
ఆగ్రో ప్రభుత్వ కంపెనీ స్థలం హైడ్రా స్వాధీనం
ఉప్పల్, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం బాబా నగర్ ఏసిపిటి ప్లాంటు సమీపంలో మూతపడిన తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రాధికారులు తొలగించారు. వ్యవసాయ రంగంలో రైతులకు వాడే రసాయన ఎరువులు తయారీ కోసం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేశారు.
లాభాలు లేకపోవడంతో ఈ కంపెనీని చాలా సంవత్సరాల నుండి మూతపడి ఉంది. 25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ కంపెనీ మూతపడడంతో రక్షణ కొరవబడి అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రభుత్వ స్థలాలు చెరువులు పరిరక్షణ కోసం ఏర్పా టు చేసిన హైడ్రా కు ఫిర్యాదు అందడంతో భారీ బలగాలతో హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. దుర్గా నగర్ బాబా నగర్ ఆనుకొని ఉన్న కంపెనీ స్థలాలను ఆక్రమించిన పలు నిర్మాణాలను హైడ్రాధికారులు తొలగించారు.
దీంతో దుర్గా నగర్ బాబా నగర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. తమకు నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా అధికారులు తమ ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది సహకారంతో హైడ్రాధికారులు నిర్మాణాలను తొలగించారు. ఈ సందర్భంగా హైడ్రా ఇన్స్పెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములు నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ జిఎంలు రాములు పాల్గొన్నారు.