calender_icon.png 2 May, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం నిర్ణయం చరిత్రాత్మకం

02-05-2025 12:40:37 AM

బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్

మహబూబ్ నగర్ మే 1 (విజయ క్రాంతి) : భారతదేశ ప్రగతికి కులగణన పునాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికిక బండారి శాంతికుమార్ పూలాభిషేకం చేసిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కులగణనతో పాటు జనగణనను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని పేర్కోన్నారు. అభివృద్ధి అంటే ఆర్ధిక అసమానతలను తొలగించడమని వివరించారు.

1931 కంటే ముందు వరకు అంటే 1881 నుండి 1931 మధ్య కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణనను కూడా చేసి జనాభా లెక్కలతో మహిళలు, పురుషులు ఎంత మంది, వెనకబడిన వారు ఎంతమంది అని తెలుసుకున్నారని పేర్కోన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ కులగణన గురించి ఆలోచించలేదని అసహనం వ్యక్తం చేశారు. 

మతపరమైన రిజర్వేషన్లు వద్దని చెప్పినా ముస్లింలను కూడా బీసీల కింద గుర్తించి కులగణన యొక్క లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తారుమారు చేసిందన్నారు.  రాజ్యాంగంలోని అధికరణ 246 ప్రకారం ‘ గణన ‘ అనేది కేంద్ర జాబితాలో 69 వ అంశంగా ఉందని, అందువల్లన జనగణన, కులగణన బాధ్యతను పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

భారతదేశం మరింత అభివృద్ధి పథంలో నడిచేందుకు ఈ కులగణన కీలకమైనదని శాంతికుమార్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడకుల బాలరాజ్, మాజీ కౌన్సిలర్ చెన్న వీరయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబి రాజు, నాగరాజు, పిల్లి సూర్యనారాయణ, కౌకుంట్ల ఆంజనేయులు, సుదర్శన్ గౌడ్, మంగలి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.