calender_icon.png 26 May, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలి

02-05-2025 12:42:42 AM

నారాయణపేట. మే 1(విజయక్రాంతి): భూ భారతి పోర్టల్ ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన జిల్లా లోని మద్దూరు మండలంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో  వచ్చి న దరఖాస్తుల పరిశీలన ను త్వరగా పూర్తి చేసి భూ సమస్యలను పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  ఆదేశించారు. భూ భారతి ఫైలెట్ ప్రాజెక్టు మద్దూరు మండలంలోని గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో రైతుల నుంచి స్వీకరించిన సమస్యల దరఖాస్తుల పరిశీలనకు కోస్గి, మద్దూరు మండలాల తహాసిల్దార్ల  నేతృత్వంలోని రెవెన్యూ అధికారుల బృందం మద్దూరు.

తహాసిల్దార్  కార్యాలయంలో సమస్యల వారీగా చేస్తున్న దరఖాస్తుల పేపర్ వర్క్ తో పాటు సమస్యల పరిష్కారానికి  అధికారులు  తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు వచ్చాయని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మద్దూరు తహసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షించారు. 

సదస్సులలో వచ్చిన విరాసత్, హద్దుల సమస్యలు, అసైన్డ్, పేరు మార్పిడి, అన్నదమ్ముల భాగ పరిష్కారం లాంటి సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి  క్షేత్రస్థాయిలో అధికారుల బృందం కొత్త చట్టం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కలెక్టర్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆర్డిఓ రామచంద్రనాయక్,అనిల్ కుమార్, డిటీ  వాసు దేవ రావు,అధికారులు పాల్గొన్నారు.