03-02-2026 01:22:13 AM
సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేందర్ గుప్తా
ముషీరాబాద్, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): మన పురాతన కాలం నుంచి ప్రకృతి వనమూలికలచే ఆయుర్వేద వైద్యం వాడుకలో ఉందని సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉపేందర్ గుప్తా అన్నారు. ఈ మేరకు సోమవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు మీడియా సమావేశంలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు కొండా మాధవి, శ్రీనివాస్ గురూజీలు రూపొందించిన ఆయుర్వేదిక్ ఉత్పత్తులు క్యాన్సర్, మధుమేహం,
పక్షవాతం తదితర వ్యాధులకు సంబంధించిన ఆయన విడుదల చేసి మాట్లాడారు. ఆయుర్వేదిక్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య నిపుణులు బ్రాహ్మాచారి, మాజీ డీసీసీబీ నల్గొండ మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టి బాబు నాయక్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.