calender_icon.png 3 February, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ సెపక్‌తక్రా జట్టుకు గోల్డ్ మెడల్

03-02-2026 01:20:53 AM

జపాన్‌లో ఏషియన్ గేమ్స్ నిర్వహణ

అభినందించిన సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ తదితరులు

హైదరాబాద్, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్ 2026 టెస్ట్ ఈవెంట్‌లో భారత్ పురుషుల సెపక్‌తక్రా జట్టు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించడం దేశానికి గర్వకారణమని సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ పెరిక సురేష్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ఎస్‌ఆర్‌ప్రేమ్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ స్థాయిలో బలమైన పోటీదారులను ఓడించి  విజయం సాధించి కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. చీఫ్ కోచ్ హేమరాజ్ నాయకత్వంలో, సెక్రటరీ జనరల్ నరేష్ కుమార్ సమర్థవంత మైన నిర్వహణతో జట్టు ఈ విజయాన్ని సాధించిందని తెలిపారు.

విజేతగా నిలిచిన భారత జట్టులో అకాష్ యుమ్నామ్, సందీ ప్ కుమార్, అరుణ్, రామ్ కుమార్, బాబీ కుమార్, ఎస్. మలమ్గాసింగ్ లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. వీరందరి సమిష్టి కృషి, అంకితభావం దేశానికి గర్వకారణంగా నిలిచాయన్నారు.ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు కొలంబోలో జరగనున్న 6వ దక్షిణాసియా సెపక్‌తక్రా ఛాంపియన్ షిప్‌కు వెళు తున్న భారత జట్టుకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. జట్టు సభ్యులను తెలంగాణ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.