30 May, 2026 | 2:30 AM

పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్న కేంద్రం

30-05-2026 12:00 AM

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్

బోథ్, మే 29 (విజయక్రాంతి): దేశంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2014 నుండి ఇప్పటి వరకు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ విమ ర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శంకర్ రావు భవన్ లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి. గోవర్ధన్ అధ్యక్షతన జిల్లా కా ర్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సంపదను కార్మికుల అశ్రమాన్ని దోచి పెట్టుబడిదారులకు ఇస్తుందన్నారు.

44 కారణంగా చట్టాలను కుదించి నాలుగు రోడ్లు తీసుకువచ్చి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నార న్నారు .దేశంలో దాదాపు 55 కోట్ల మంది కార్మికులు ఉన్నారని కార్మికులు కన్నెర్ర చేసి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పోల్చుతారన్నారు.నాలుగు కోట్లను వెంటనే రద్దుచేసి కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్. చేశారు లేని పక్షంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.