13 May, 2026 | 4:44 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

కేంద్రం ఓబీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని రూపొందించాలి

18-03-2026 12:00 AM

జాతీయ ఓబీసీ సెమినార్‌లో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి 17(విజయక్రాంతి): ఓబీసీల రాజ్యాంగ బద్ధమైన హక్కు ల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఓబీసీ వర్గాలు సంఘటితంగా పోరా డాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.

ఈ మేరకు మంగళవారం ఢిల్లీ ఏపీ భవన్ గురజాడ హాల్‌లో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ అధ్యక్షతన జరిగిన జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్ లో ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు యాదవ్ లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులకు దశలవారీగా అమలు చేయాలని, ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలన్నారు.

మే నెలలో విజయవాడ, హైదరా బాద్‌లో లక్ష మందితో బీసీ గర్జన నిర్వహిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించి ఓబీసీ కులాల డిమాండ్లను  చట్టసభలలో స్థానిక సంస్థలలో ఓబీసీ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, జాతీయ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని సాధించి తీరుతామని ప్రకటించారు. ఈ సెమినార్‌లో ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, సుజాన్సింగ్, సుబ్బారావు మధువన్, కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు.