20-01-2026 12:17:33 AM
భీమదేవరపల్లి, జనవరి 19 (విజయక్రాంతి) వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవిని బ్రహ్మోత్సవంలో భాగంగా కు సోమవారం ఓ ఎస్ డిశ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కొత్తకొండ వచ్చి కోడె మొక్కు చెల్లించి, గుమ్మడికాయ కో రమీసం స్వామివారికి సమర్పించి అభిషేకము, కుంకుమార్చన చేశారు .
అనంతరము దేవస్థానం తరుపున శేష వస్త్రంతో ఘనంగా సన్మానం చేశారు. వీరభద్ర స్వామి కార్యనిర్వానాధికారి కిషన్ రావు అర్చకులు ఘనంగా సన్మానంతో వేద ఆశీర్వాదములు ఇచ్చిన అర్చక బృందం కొత్తకొండ దేవస్థానం ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు, అర్చకులు తాటికొండ రమేష్, జానకిపురం రవి శర్మ, మొగిలిపాలెం శివకుమార్‌లు పాల్గొన్నారు.