పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి
బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ చెక్ అందజేత
శేరిలింగంపల్లి, మార్చి 29 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ అన్నారు. శేరిలింగం పల్లి డివిజన్ స పరిధిలోని మజీద్ బండకు చెందిన బసవరాజ్, లింగస్వామి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహా య నిధికి దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.50,000ల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కును మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో లబ్ధిదారునికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందిం చిన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని బాధిత కుటుం బ సభ్యులు పేర్కొన్నారు




