గంట వానకే వణికిన నగరం
- గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం
జలమయమైన రహదారులు, లోతట్టు ప్రాంతాలు
భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు
గోల్కొండలో కూలిన 200 ఏళ్ల చెట్టు, ఒకరికి గాయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరబాద్‌లో సోమ వారం సాయంత్రం మెరుపులు, ఉరుములతోపాటు ఊదురుగాలులతో కూడిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. కేవలం గంట పాటు దంచికొట్టిన వానకు నగరంలోని రహదారులన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమ య్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. నగరవ్యాప్తంగా కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలతోపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా కలిగింది.
కూలిన 200 ఏళ్ల నాటి చెట్టు
ఈదురుగాలుల ధాటికి గోల్కొండ ప్రాం తంలోని 200 ఏళ్ల నాటి భారీ చెట్టు కూలిం ది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యా యి. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రేటర్ వ్యాప్తంగా గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్‌పేట, లంగర్‌హౌజ్, గండిపేట, శివరాంపల్లి, ఎస్సార్‌న గర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బేగం బజార్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సీగూడ, చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దు ల్లాపూ ర్‌మెట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ బృందాలు (డీఆర్‌ఎఫ్) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పలు ప్రాం తాల్లో నిలిచిన వర్షపు నీరును క్యాచ్‌పిట్లలో పారేలా చర్యలు చేపట్టారు. నగరంలో అత్యధికంగా లంగర్‌హౌజ్‌లో 5.8 సెం.మీ., మెహిదీపట్నంలో 5.7 సెం.మీ., ఖైరతాబాద్‌లో 5.2 సెం.., తుర్కయంజాల్‌లో 4.7 సెం.మీ., షేక్‌పేటలో 4.6 సెం.మీ., మేడిపల్లిలో 3.9 సెం.మీ., ఉప్పల్, హిమాయత్‌నగర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో 3.6 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
70 ఫిర్యాదులు..
భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) అధికారులకు 70 ఫిర్యాదులు అందాయి. ఈ కంప్లయింట్స్ అత్యధికంగా రోడ్లపై వర్షపు నీరు నిల్వడం, చెట్ల కొమ్మలు విరిగి పడటం, చెట్లు పడిపోవడం, క్యాచ్‌పిట్ల వద్ద వర్షపు నీరు నిలవడం తదితర సమస్యలు గురించినవిగా అధికారులు తెలిపారు. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్ల పరిధిలో డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నగరంలో 14 చోట్ల చెట్లు పడిపోగా, 13 ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. 26 ప్రాంతాలలో నీరు నిలిచినట్టుగా, 17 ప్రాంతాల్లో క్యాచ్‌పిట్ల వద్ద నీరు నిల్వ ఉన్నట్టుగా డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. వీటిలో 57 ఫిర్యాదులను పరిష్కరించి న సిబ్బంది మరో 13 చోట్ల పనులు చేపడుతున్నట్టు ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
అత్యవసరమైతేనే బయటకు రండి: ఇన్‌చార్జి మంత్రి పొన్నం
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్, విద్యుత్‌శాఖ, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. నగరంలో 141 నీరు నిలిచే ప్రాంతాలలో ఎప్పటికప్పుడు వరద లేకుండా చర్యలు తీసు కోవాలన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేయాలని నగ ర పోలీస్ కమిషనర్‌కు పొన్నం సూ చించారు. భారీ వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి అధికారులకు సూచించారు.






