18 July, 2026 | 2:28 PM

క్లినిక్‌లు సీజ్

27-10-2024 12:24 AM

పరిగి, అక్టోబర్ 26: పరిగి కేంద్రంగా నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లలో శనివారం ఐఎంఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమ తులు లేకుండా నడుపుతున్న రాఘవేంద్ర క్ల్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, గఫర్ క్లినిక్, పల్లవి క్లినిక్‌తో పాటు మరో క్లినిక్‌ను సీజ్ చేశారు. ఈ క్లినిక్‌లలో వైద్యం అందిస్తున్నవారు కేవలం టెన్త్, ఇంటర్ చదివినట్లు గుర్తించారు.

వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో క్లినిక్‌లో 5 నుంచి 10 బెడ్లు వేసి వైద్యం అందిస్తున్నట్లు గుర్తించామన్నారు. తని ఖీల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్  శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు.